ఘనంగా ముత్యాల తలంబ్రాల ఊరేగింపు

తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం ముత్యాల తలంబ్రాల ఊరేగింపు ఘనంగా జరిగింది. ముందుగా టిటిడి పరిపాలనా భవనంలోని ఖజానా విభాగంలో ముత్యాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

talambralu

అనంతరం శ్రీ కోదండరామాలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆనందకుమార్‌ దీక్షితులు ఏనుగుపై ముత్యాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఊరేగింపు తీర్థకట్ట వీధి, గాంధీ రోడ్డు, శ్రీగోవిందరాజస్వామివారి ఆలయ దక్షిణ మాడ వీధి, బజారు వీధి గుండా ఆలయానికి చేరుకుంది. ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

1984వ సంవత్సరం నుండి టిటిడి పరిపాలనా భవనం నుండి ముత్యాల తలంబ్రాలను శ్రీకోదండరామాలయానికి  తీసుకువెళ్ళడం ఆచారంగా వస్తోంది.  సాయంత్రం సీతారామస్వామి వారి కల్యాణం అంగరంగవైభవంగా నిర్వహించారు. అ నంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారని చెప్పారు. మార్చి 27న మంగళవారం రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు రామాలయంలో శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరిగింది.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *