అన్నవరం సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవాలకు ఏర్పాట్లు

అన్నవరం శ్రీ సత్యనారాయణమూర్తి ఆవిర్భావ దినోత్సవాలు ఆగస్టు 12, 13 తేదీల్లో నిర్వహించనున్నారు. మొట్టమొదటిసారిగా ఈ ఏడాది ఆవిర్బావదినోత్సవం రోజు అయిన 13వ తేదీన సత్యదేవునికి పుష్పపల్లకీ సేవను నిర్వహిస్తున్నారు. మహోత్సవాలకు సంబంధించిన ఆహ్వానపత్రికను అన్నవరం దేవస్థానం అధికారులు ఆదివారం ఆవిష్కరించారు.

అన్నవరం లో మహోత్సవాలు ఇలా…

  • 12న స్వామివారి మూలవిరాట్టుకు మఖనక్షత్ర పంచామృతాభిషేకం
  • 13న తెల్లవారుజామున మహన్యాసపూర్వక పంచామృతాభిషేకం, సాయంత్రం 6 గంటలకు పుష్పపల్లకీసేవ, 7.30 గంటల నుంచి దర్బాసుసేవ, పంచహారతులు

అన్నవరం ఉత్సవాల్లో ప్రత్యేక పుష్పాలంకరణ

అన్నవరం సత్యనారాయణస్వామికి ఫలపుష్ప సేవను వైభవోపేతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం స్వామివారి నిత్య కళ్యాణమంటపాన్ని అన్ని హంగులతో సిద్ధంచేస్తారు. దీంతోపాటు రత్నగిరిపై నిర్మిస్తున్న యాగశాలను ఆగస్టు 12వ తేదీన ప్రారంభించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *