‘అన్నమయ్య జీవుని కొలువు, అన్నమయ్య గీతాసారం’ సంకీర్తనల ఆవిష్కరణ

 శ్రీవారు జన్మించిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నవంబరు 25 శనివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ”అన్నమయ్య జీవునికొలువు”, ”అన్నమయ్య గీతాసారం” సంకీర్తనలను ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి ఆవిష్కరించారు.

టిటిడి ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ సంకీర్తనలను రికార్డు చేశారు. ”అన్నమయ్య జీవునికొలువు” సంకీర్తనలను శ్రీ బి.రఘునాథ్‌ స్వరపరిచి గానం చేశారు. ”అన్నమయ్య గీతాసారం” సంకీర్తనలను శ్రీ పిఆర్‌.రామనాథన్‌ స్వరపరిచి ఆలపించారు. ఈ సందర్భంగా కళాకారులను శాలువతో సన్మానించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం కళాకారులు ఈ సంకీర్తనలను పాడి వినిపించారు.

ఈ సంకీర్తనలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడమైనది. భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *