సజీవ శిల్పకళతో అలరారుతున్న బేలూరు ఆలయం

దేశంలో స్వయంభువులుగా వెలసిన ఎన్నో ప్రాచీన ఆలయాలతోపాటు రాజవంశస్థులు నిర్మించిన మరెన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు  వున్నాయి.  మరికొందరు రాజులు  చరిత్రలో తమ పేరుప్రతిష్టలు చిరకాలంగా నిలిచిపోయేలా కొన్ని ఆలయాలను  నిర్మించుకున్నవారున్నారు. అటువంటి ఆలయాల్లో ‘చెన్నకేశవ ఆలయాన్ని ఒకటిగా చెప్పుకోవచ్చు. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని హోయసల రాజవంశస్థులు నిర్మించినట్లు చారిత్రక నిపుణులు పేర్కొంటున్నారు. 

బేలూరు ప్రత్యేకత

బేలూరు కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా బేలూరు పట్టణంలో వుంది. బేలూర్ కర్ణాటకలో ప్రముఖ పర్యాటక ప్రదేశము . అనేక ఆలయాలకు నెలవైన ఈ పట్టణం హసన్ జిల్లా లో బెంగుళూర్ నుండి కేవలం 220 కి. మీ. ల దూరంలో ఉంది. ఇది యగాచి నది ఒడ్డున ఉంది. అతి ప్రాచీనమైన, విశిష్టమైన దేవాలయలయ౦ అవడం వలన దీనిని అందరు దక్షిణ కాశి అంటారు. చారిత్రకంగా బేలూర్ విశిష్టమైనది బేలూర్ హొయసల సామ్రాజ్య రాజధానిగా ఉంది కనుక చారిత్రకంగా బేలూర్ విశిష్టమైనది. ఇక్కడికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న హలేబిడ్ కూడా హొయసల రాజధానిగా ఉంది ఇది పురాతన నగరం. ఈ రెండు నగరాలు ఈ రెండు నగరాలు హొయసల నిర్మాణ ప్రతిభకు అద్దంపడతాయి. యాత్రీకులు ఈ రెండు నగరాలను ఒకే సారి దర్శిస్తూ ఉంటారు.

మహావిష్ణువు ఆలయ౦

విష్ణు భగవానుడి కోసం నిర్మించిన ఈ ఆలయంలో గాలిగోపురం ఎంతో ప్రసిద్ధి చె౦ది౦ది. బేలూర్ లో అన్నిటికన్నా గొప్ప ఆలయ సముదాయం నిస్సందేహంగా చెన్నకేశవ ఆలయం. ఈ ఆలయం లోని రక రకాల శిల్పాలు సజీవంగా ఉన్నాయా అన్నంత బాగుంటాయి. 

అత్యంత రమణీయమైన దేవాలయాల్లో ఒకటైన చెన్నకేశవ దేవాలయం తప్పక సందర్శించదగినది. ఈ దేవాలయం మృదువైన సున్నపురాయిని ఉపయోగించి నిర్మించారు. ఈ ఆలయము విష్ణువు యొక్క ఒక అవతారము ఐన చెన్నకేశవ స్వామికి అంకితం చేయబడినది.  యవ్వన పడతుల చిత్రాలు, వర్ణ చిత్రాలు పర్యాటకులు పురాణాల్లోని అనేక గాధలను, ఉపనిషత్తులను, ఏనుగులు, రామాయణ మహాభారతాలలోని అనేక ఘట్టాలను వివరించే శిల్పాలను కూడా చూడవచ్చు.

ఇంకా వివిధ భంగిమలలోని నర్తకీ శిల్పాలు, ద్వారాల దగ్గర ద్వారపాలకుల శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయి. అందులో ముఖ్యంగా దర్పణ సుందరి, భస్మ మోహిని చెప్పుకోదగిన ఆకర్షణీయ శిల్పాలలో కొన్ని! పర్యాటకులు ఆలయం యొక్క ప్రవేశద్వారం వద్ద ఒక పుష్కరణిని (మెట్లబావి) కూడా చూడవచ్చు. ఆలయం అంతర్భాగంలో విజయనగర సామ్రాజ్యం రోజులలో రాజగోపురాలు నిర్మించబడ్డాయి. 

బేలూర్ – గ్రావిటీ పిల్లర్

ఈ ఆలయానికి బయట 42 అడుగుల ధ్వజస్తంభం ఉంది. మహాస్తంభం లేదా కార్తిక దీపోత్సవ స్తంభం అని పిలవబడే ఈ 42 అడుగుల స్తంభం చెన్నకేశవ ఆలయ ప్రధాన ఆకర్షణలలో ఒకటి. దీని విశేషమేమిటంటే ఈ స్తంభం ఒక వైపు ఆధారం నేలను తాకి ఉండదు. మూడు వైపుల ఆధారం మీద నిలిచి ఉంటుంది. హొయసల శైలి శిల్పకళకు నిలువుటద్దంగా ఈ దేవాలయం వుంటుంది.

బేలూర్ చేరుకోవడం ఎలా? 

రోడ్డు మార్గం బేలూర్ హళేబీడు లకు మీరు రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. హస్సన్ నుండి బస్సు ద్వారా గాని లేకుంటే మీకు సొంత వాహనం ఉంటే మీరే సొంతంగా డ్రైవ్ చేసుకొని రావచ్చు. దేశ౦లోని వివిధ ప్రా౦తాలను౦చి ము౦దుగా బె౦గళూరు చేరుకు౦టే బెంగళూరు, మైసూరు నుంచి   బస్సులు అ౦దుబాటులో ఉ౦టాయి. రైలు మార్గం ద్వారా వచ్చేవారు ము౦దుగా హస్సన్ రైల్వే స్టేషన్ చేరుకోవాలి. బెంగళూరు, మైసూరు, మంగళూరు ప్రాంతాలనుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. విమానాల ద్వారా రావాలనుకునేవారికి చేరువలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం బెంగళూరు.   ఇది సుమారుగా 223 కి. మీ .దూరంలో ఉన్నది. ఈ విమానాశ్రయానికి  దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచే కాక, వివిధ దేశాల నుంచి కూడా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *