షోడసకళానిధికి షోడస వాహనసేవలు

”షోడసకళానిధికి షోడసోపచారములు 
జాడతోడ నిచ్చలును సమర్పయామి”
అని పదకవితా పితమహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు తిరుమల శ్రీవారి వివిధ ఉత్సవ వైభవాలను హృద్యంగా తమ సంకీర్తనలో వివరించారు.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మూెత్సవాలు ఈ నెల 23 నుండి అక్టోబరు 1 వరకు జరుగనున్న నేపథ్యంలో శ్రీవారి ఉత్సవమూర్తి అయిన శ్రీ మలయప్పస్వామివారు 16 దివ్యవాహనాలపైన తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

స్వామివారికి నూతన సర్వభూపాల వాహన సేవ

2013వ సంవత్సరంలో నూతన స్వర్ణరథంపై భక్తులను కనువిందుచేసిన స్వామివారు ఈ ఏడాది బ్రహ్మూెత్సవాలలో శ్రీ మలయప్పస్వామి నూతన సర్వభూపాల వాహనంపై భక్తులను అలరించనున్నారు. కాగా దాదాపు రూ. 8 కోట్లతో 1020 కిలోల బరువు కలిగిన ఈ వాహనంలో 8.89 కిలోల బంగారం 355 కిలోల రాగి (చెక్క బరువు 655 కిలోలు) ఉపయోగించారు. ఇప్పటికే ఈ సర్వభూపాల వాహనాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు.

బ్రహ్మూెత్సవ విశేష కార్యక్రమ మరియు వాహన సేవ వివరాలు

శ్రీవారి నవాహ్నిక వార్షిక బ్రహ్మూెత్సవాలకు సంబంధించి ఈ నెల 19వ తారీఖున కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 22న అంకురార్పణంతో ప్రారంభం కానున్న బ్రహ్మూెత్సవ వాహన సేవల వివరాలు.
  • సెప్టెంబరు 23 ధ్వజారోహణం (మీనలగ్నం సా. 5.48 నుండి సా. 6.00 వరకు) పెద్దశేషవాహనం – రాత్రి 9.00 నుండి రాత్రి 11.00 వరకు
  • సెప్టెంబరు 24 చిన్న శేషవాహనం- ఉ. 9.00 నుండి ఉ. 11.00 వరకు హంసవాహనం – రాత్రి 9.00 నుండి రాత్రి 11.00 వరకు
  • సెప్టెంబరు 25 సింహవాహనం – ఉ. 9.00 నుండి ఉ. 11.00 వరకు ముత్యపుపందిరి – రాత్రి 9.00 నుండి రాత్రి 11.00 వరకు
  • సెప్టెంబరు 26 కలపవృక్ష వాహనం – ఉ. 9.00 నుండి ఉ. 11.00 వరకు సర్వబూపాలవాహనం – రాత్రి 9.00 నుండి రాత్రి 11.00 వరకు
  • సెప్టెంబరు 27 మోహినీఅవతారం – ఉ. 9.00 నుండి ఉ. 11.00 వరకు గరుడవాహనం – రాత్రి 7.30 నుండి ఉ. 1.00 వరకు
  • సెప్టెంబరు 28 హనుమంత వాహనం – ఉ. 9.00 నుండి ఉ. 11.00 వరకు రథరంగ డోలోత్సవం – సా. 5.00 నుండి సా. 7.00 వరకు గజవాహనం – రాత్రి 9.00 నుండి రాత్రి 11.00 వరకు
  • సెప్టెంబరు 29 సూర్యప్రభ వాహనం – ఉ. 9.00 నుండి ఉ. 11.00 వరకు చంద్రప్రభ వాహనం – రాత్రి 9.00 నుండి రాత్రి 11.00 వరకు
  • సెప్టెంబరు 30 రోథోత్సవం – ఉ. 7.00 లకు అశ్వ వాహనం – రాత్రి 9.00 నుండి రాత్రి 11.00 వరకు
  • అక్టోబరు 1 చక్రస్నానం – ఉ. 6.00 నుండి ఉ. 9.00 వరకు ధ్వజావరోహణం – రాత్రి 9.00 నుండి రాత్రి 10.00 వరకు.
కాగా ఈ వాహనసేవల్లో స్వామివారు తన ఉభయదేవేరులతో కూడి పెద్దశేషవాహనం, ముత్యపుపల్లకి, కల్పవృక్ష, సర్వభూపాల, స్వర్ణరథ మరియు రథోత్సవాలలో భక్తులను అలరిస్తే చిన్నశేష, హంస, సింహ, గరుడ, హనుమంత, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ మరియు అశ్వవాహనాలపై వివిధ రూపాలలో శ్రీ మలయప్ప భక్తులను అలరిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *