శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారంనాడు శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. సాధారణంగా సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం    వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు జరుగుతుంది. ఈ నెల 29న వైకుంఠఏకాదశి సందర్భంగా  మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు.

శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఇందులోభాగంగా ఉదయం 6 నుండి 10 గంటల వరకు గర్భాలయం, ఉప ఆలయాలు, పోటులను అర్చకులు ఆగమోక్తంగా శుద్ధి చేశారు. ఆలయ సిబ్బంది అత్యంత భక్తిశ్రద్ధలతో శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. శుద్ధి కార్యక్రమం అనంతరం 11 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభమైంది.

Source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *